గంజాయి విక్రయిస్తున్న జై సింగ్ అరెస్ట్

by velandi.Saikiran |

గంజాయి సేవిస్తూ.. విక్రయాలు చేపడుతున్న ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్న సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు

గంజాయి విక్రయిస్తున్న జై సింగ్ అరెస్ట్
X

దిశ, నాచారం : గంజాయి సేవిస్తూ.. విక్రయాలు చేపడుతున్న ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్న సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ చాణిక్యపురి కాలనీ దుర్గామాత టెంపుల్ సమీపంలో ఒడిస్సాకు చెందిన జగన్నాథ్ జై సింగ్ నిత్యం గంజాయి సేవిస్తూ విక్రయాలు చేపడుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నాచారం ఎస్ఐ వెంకటయ్య నేతృత్వంలో రెక్కీ నిర్వహించి గంజాయి విక్రయదారుడు జై సింగును అదుపులోకి తీసుకున్నారు. జై సింగ్ నుండి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story