- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో, రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి
తెలంగాణ యువతలో మేధో సంపత్తిని బయటికి తెచ్చేందుకు క్విజ్ ఏర్పాటు చేస్తున్నామని, టెక్నాలజీని దేశానికి అందించింది రాజీవ్ గాంధీ అని, రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ దే అని రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : తెలంగాణ యువతలో మేధో సంపత్తిని బయటికి తెచ్చేందుకు క్విజ్ ఏర్పాటు చేస్తున్నామని, టెక్నాలజీని దేశానికి అందించింది రాజీవ్ గాంధీ అని, రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ దే అని రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ ఠాక్రే, రేవంత్ రెడ్డి.. అనంతరం క్విజ్ కాంపిటీషన్ బ్రోచర్ ఆవిష్కరించారు. రాబోయేది దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఆస్కార్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కు ప్రభుత్వం గ్రహించకుండా చిన్నచూపుచూసి ఎటువంటి స్వాగతం పలకలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
టీవీలో ఆస్కార్ అవార్డ్ లు చూడటం తప్ప, ఆస్కార్ అవార్డ్ అందుకున్నవారు తెలుగులో లేరన్నారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కు కాంగ్రెస్ తరపున పదిలక్షల నజరానను రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్విజ్ లో బహుమతులు గెలుపొందిన వారికి ప్రియాంక గాంధీ చేతులమీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్ ఠాక్రే, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవుడు, రామ్ కుమార్, బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.






