- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ లే అవుట్లు.. అడ్డగోలు విక్రయాలు!
ప్రభుత్వ అనుమతులుండవు.. భూ మార్పిడి పన్నులు చెల్లించరు. కానీ.. దర్జాగా అనధికారిక లే అవుట్లు వేసి అక్రమార్కర్జనకు తెరలేపుతున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రభుత్వ అనుమతులుండవు.. భూ మార్పిడి పన్నులు చెల్లించరు. కానీ.. దర్జాగా అనధికారిక లే అవుట్లు వేసి అక్రమార్కర్జనకు తెరలేపుతున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో నిబంధనలు మాకేం పట్టవన్నట్లు అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. నేతల అండదండలు ఉండడంతో అనధికారిక వెంచర్లకు అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార యంత్రాంగం అక్రమార్కులతో అంటకాగుతూ.. వారిచ్చే ముడుపులకు అశపడి సహకారిస్తున్నరన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
రాత్రికి రాత్రే రోడ్లు..
జిల్లాలోని మూడు చింతపల్లి మండలం, లక్ష్మాపూర్ గ్రామంలోని సర్వే నం. 367లో కొందరు అక్రమ వెంచర్ వేశారు. వీరికి గ్రామ పంచాయతీ, హెచ్ఎండీఏల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని సమాచారం. గతంలో ఈ వెంచర్ లో అక్రమంగా రోడ్లు వేసేందుకు ప్రయత్నించగా మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు. వెంచర్‌లో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను జేసీబీ సాయంతో తొలగించారు. శుక్రవారం రాత్రి వెంచర్ నిర్వాహకులు తెగించారు. వెంచర్‌లో రాత్రి రాత్రికే చదును చేసి కొత్తగా రోడ్లు నిర్మించారు. వెంచర్‌లో రోడ్లు వేస్తున్న విషయాన్ని స్థానికులు మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంచర్ నిర్వాహకులు రెవెన్యూ, మున్సి పల్, ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా నయానో.. భయానో మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. దీనివల్లనే వెంచర్ లో రోడ్లు వేసినా పట్టించుకోవడంలేదన్న ప్రచారం జరుగుతోంది.
అనుమతులు ఇలా..
లే అవుట్ వేయలాంటే హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి. లే అవుట్ వేస్తున్న భూమి విలువ ప్రకారం నాలా పన్ను చెల్లించాలి. లే అవుట్ లో ఎకరాలో పదిశాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టాలి. కానీ లక్ష్మాపూర్ లో వెంచర్ నిర్వాహకులు మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. రెండు, మూడు ఎకరాల్లో లే అవు ట్ వేసి.. చిన్న చిన్న రాళ్లు హద్దులుగా నిర్ణయించి విక్రయించేసి సోమ్ము చేసుకుంటున్నారు. బతుకు దెరువు కోసం వచ్చిన కార్మి కులు, ఉద్యోగులు రోజువారీ, నెలవారి సంపాదనలో కొంత పొదుపు చేస్తున్నారు. ఆ సొమ్ముతో సొంతిల్లు నిర్మించుకొని స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలుదారుల అవగాహనా రాహిత్యం, పేదరికమే ఆసరగా అక్రమ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. అనుమతులేని వెంచర్లు వేసి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారు. కనీసం వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే ప్లాట్లుగా విభజన చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోతుండగా, అనుమతుల్లేని వెంచర్లలో ఇళ్ల స్థలాలు కొన్న వారికి పాట్లు తప్పడంలేదు. ఇప్పటికైనా అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






