అక్రమ నిర్మాణాలకు అంతులేదు.. 66 గజాల్లో ఐదు అంతస్థులు

by Ajay Maddhiboyina |

కూకట్​పల్లి జోన్​ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతుంది. జోన్​ పరిధిలోని కూకట్​పల్లి, ఆల్విన్​ కాలనీ సర్కిళ్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని నిర్మాణాలు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలకు అంతులేదు.. 66 గజాల్లో ఐదు అంతస్థులు
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి జోన్​ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతుంది. జోన్​ పరిధిలోని కూకట్​పల్లి, ఆల్విన్​ కాలనీ సర్కిళ్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని నిర్మాణాలు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. అయితే టౌన్​ప్లానింగ్​ అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. సర్కిల్​ పరిధిలోని ఆంజనేయ నగర్​, కేపీహెచ్​బీకాలనీలోని అన్ని ఫేజ్​లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణా లు కొనసాగుతున్నాయి. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

66 గజాల్లో ఐదు అంతస్థులు..

కేపీహెచ్​బీకాలనీ 7వ ఫేజ్​లో ఓ నిర్మాణాదారుడు ఏకంగా 66 గజాల భూమిలో ఏకంగా 5 అంతస్థులు నిర్మిస్తున్నాడు. అదీ ఎటువంటి అనుమతులు లేకుండానే. అదే విధంగా ఆంజనేయ నగర్​ కాలనీలో నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న భవనానికి అధికారులు అన్ని తామై చూసుకుంటున్నార్న ఆరోపణలు ఉన్నాయి.

నిర్మాణం పూర్తికాకుండానే..

నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న భవనాన్ని ప్రైవేటు పాఠశాల ఏర్పాటుకు అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. పనులు పూర్తి కాకుండానే బయటి భాగంలో రంగులు వేసి పాఠశాల అడ్మిషన్​ల ప్రక్రియ కానిచ్చేస్తున్నారు.

Next Story