ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..!

by velandi.Saikiran |   (  Updated:2025-12-15 21:15:32  IST  )

ఖాళీ స్థలం కనిపిస్తే అక్రమణే.. ప్రభుత్వ భూ ములు ఖాళీగా ఉంటే చాలు గుట్టు చప్పుడు కాకుండా ప్రీకాస్ట్ వాల్స్ వేసేస్తున్నారు. అంతే

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..!
X

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..

-రిసార్ట్ యాజమాని భూ మాయ

-గ్రామ నక్ష రోడ్డుతోపాటు ప్రభుత్వ భూముల అక్రమణ

-సర్వే చేసి కబ్జా అని తేల్చినా.. స్వాధీనంలో జాప్యం

దిశ, మేడ్చల్ బ్యూరో: ఖాళీ స్థలం కనిపిస్తే అక్రమణే.. ప్రభుత్వ భూ ములు ఖాళీగా ఉంటే చాలు గుట్టు చప్పుడు కాకుండా ప్రీకాస్ట్ వాల్స్ వేసేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ భూముల్లో సర్కా రు అనుమతులు లేకుండా రోడ్ల ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలా లు కబ్జా అవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా రు. దీంతో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో రూ. కోట్ల విలువైన స ర్కారు భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెల్లుతున్నాయి. మూడు చింతలపల్లిలోని అద్రాస్‌ పల్లిలో ఓ రిసార్ట్ యాజమాని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు వేసినా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెల్లుతున్నాయి.

రూ.5 కోట్ల విలువైన స్థలం కబ్జా..

ఎంసీపల్లి మండల పరిధిలోని అద్రాస్‌పల్లి గ్రామంలో సర్వే నం. 270/1లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి, సర్వే నం. 270/2లో 15 ఎకరాల అటవీ భూములు ఉ న్నాయి. ఆ ప్రభుత్వ భూముల ప క్కనే గోనె శ్రీనివాస్ అనే వ్యక్తి సర్వే నం. 267లో అక్రమంగా కృష్ణ సెరెనీ పేరిట రిసార్ట్ నడుపుతున్నాడు. అయితే పొన్నాల శివా రు నుంచి అద్రాస్‌పల్లి గ్రామానికి వెళ్లేందుకు గ్రామ నక్షలో 33ఫీట్ల రోడ్డు ఉంది. ఈ రోడ్డుతో పాటు పక్కనే సర్వే నం. 270/1,270/ 2లోని ప్రభుత్వ, అటవీ భూముల పై రిసార్ట్ యాజమాని శ్రీనివాస్ కన్నుపడింది. పక్కనే ఉన్న గ్రామ నక్ష రోడ్డుతోపాటు ప్రభుత్వ భూ ములను కూడా రిసార్ట్ యాజ మాని అక్రమించారని రైతులు ఆరోపిస్తున్నారు.

సర్వే చేసినా..

కృష్ణ సేరని రిసార్ట్ యాజమాని శ్రీనివాస్ కబ్జా వ్యవహారంపై గ్రామ రైతులు పలుమార్లు తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాలలో ఫిర్యాదు చేశారు. మూడు చింతలపల్లి మండల తహశీల్దార్ ఆదేశాలతో (బీ/1234/2024 ప్ర కారం) 2024, సెప్టెంబర్ 20వ తేదీన మండల సర్వేయర్లు భూ ములను సర్వే చేశారు. అక్కడ బండ్ల బాట ఉంది నిజమేనని తే ల్చడంతో పాటు.. రిసార్ట్ యాజ మాని ప్రభుత్వ, గ్రామ బండ్లబాటను కబ్జా చేసినట్లు గుర్తించారు. కబ్జా చేసింది 12.5 ఫీట్లు అని నిర్ధారించి హద్దులు కూడా పాతా రు. ఆ తర్వాత ఏమైందో కానీ ఇప్పటి వరకు రెవెన్యూ అధికారు లు రిసార్ట్ యాజమాని కబ్జా చేసి న స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిసార్ట్ యజమాని నుంచి భారీ మొత్తం లో ముడుపులు తీసుకొని ఆయన కు సహకరిస్తున్నారని గ్రామ రైతు లు ఆరోపిస్తున్నారు.

సంవత్సరకాలంగా పోరాటమే..

కృష్ణ సేరని రిసార్ట్ యాజమాని కబ్జా చేసిన స్థలాన్ని కాపాడాలని గత సంవత్సర కాలంగా తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయా ల్లో వినతిపత్రాలను ఇస్తూనే ఉన్నా. ప్రతి ప్రజావాణిలో ఇస్తున్నప్పటికీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. సర్వే చేసి గుర్తించిన కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదు. పొన్నాల, అద్రాస్‌పల్లి గ్రామాల మధ్య రాకపోకలు సాగించేందుకు నక్షలో ఉన్న 33 ఫీట్ల బండ్లబాటతో పాటు ప్రభుత్వ, అటవీ భూములను కూడా రిసార్ట్ యాజమా ని కబ్జా చేశాడు. కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని, ఆయన పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. -నల్ల వెంకట్ రెడ్డి, గ్రామ రైతు

Next Story