- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో హవాలా రాకెట్ గుట్టు రట్టు.. కారులో రూ.4 కోట్ల నగదు స్వాధీనం
బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోయినపల్లి పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, తిరుమలగిరి: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోయినపల్లి పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది నెలల క్రితం కొంతమంది హవాలా డబ్బులు సరఫరా చేసే ముగ్గురు వ్యక్తులను బోయినపల్లి పోలీసులు పట్టుకుని వారిపై పక్కా నిఘా పెట్టారు.పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ముంబై,గుజరాత్ ల నుంచి హవాలా డబ్బు కోట్ల రూపాయలు వస్తున్నాయనే సమాచారం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాపు కాసి ఉన్నారు.
కాగా, ఈ హవాలా డబ్బు తరలిస్తున్న నిందితుల కోసం చూస్తున్న పోలీసులను చూసి వారు పారిపోతుండగా వారి వాహనాలను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం వారిని వాహనాలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ హవాలా నగదును పాత పది రూపాయల నోటు కోడ్ ఆధారంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో సుమారు రూ.4కోట్ల 5లక్షల హవాలా డబ్బుల సంచులు లభించగా, ఇద్దరు నిందితులను, ఎంహెచ్49సిఎల్ 2496 నెంబర్ గల కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.






