- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రిలోనే అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు
by Sridhar Babu |
ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ఘటనలో ప్రధాన నిందితుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు.

X
దిశ, కంటోన్మెంట్ : ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ఘటనలో ప్రధాన నిందితుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇటీవల జరిగిన ఆందోళనలో మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
స్థానికులు, బస్తీవాసులతో ప్రతినిత్యం చర్చలు జరుపుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన వారిలో ముగ్గురిని, ఆలయం వద్ద ఆందోళన చేసిన ఐదుగురిపై కేసులు నమోదయ్యాయన్నారు. ఆలయం వద్ద పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీస్ లకు సమాచారమివ్వాలని కోరారు.
- Tags
- DCP
Next Story






