- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాచుపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా చేసి గదులు నిర్మాణం
కబ్జాదారులు ధర్జాగా ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు.

దిశ, కుత్బుల్లాపూర్ : కబ్జాదారులు ధర్జాగా ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. కొంత కొంతగా ఓ ప్లాన్ ప్రకారం చిన్న గదులు నిర్మిస్తూ అందినకాడికి అప్పనంగా మింగేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాచుపల్లి సాయినగర్‌లో సర్వే నెంబర్ 186లో అనధికారిక లే అవుట్ వేసి సొమ్ము చేసుకొన్న కొందరు స్థానిక నేతలు నేడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి తమ పూర్వ అనుభవానికి వన్నె తెస్తున్నట్లు వినికిడి. బాచుపల్లి సర్వే నెంబర్ 186 లో గల ప్రభుత్వ స్థలంలో ధర్జాగా కొద్ది రోజులుగా గదులు, బేస్మెంట్స్ నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదులు వెళ్లినా డోంట్ కేర్ అనేలా కబ్జాదారులు రెచ్చిపోతూ భూ కబ్జాలలో తమ ప్రతాపం చూపేందుకు ముందుకు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కబ్జాల వెనుక బడానాయకుల అండ ??
బాచుపల్లి సర్వే 186 లో జరుగుతున్న భూ కబ్జాలలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని తప్పుదారి పట్టిస్తూ రెవెన్యూ అధికారులకు ఫోన్ లు చేయించి కబ్జాలను కూల్చకుండా ఆపివేయించుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిడి బలంగా ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం సర్వే నెంబర్ 186లో జరిగిన భూ కబ్జాలను చూసీ చూడకుండా వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి.
సర్వే నెంబర్ 186లో జరిగిన భూ కబ్జాలపై బాచుపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భానుచందర్‌ను ‘దిశ’ వివరణ కోరగా.. ఫిర్యాదులు వస్తున్నాయని, విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు.






