పట్ట పగలే ఇంట్లోకి చొరబడి బంగారం అపహరణ

by velandi.Saikiran |   (  Updated:2026-01-31 23:55:23  IST  )

పట్ట పగలే ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన నాగారం డివిజన్ పరిధిలోని ఎస్వి నగర్ లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

పట్ట పగలే ఇంట్లోకి చొరబడి బంగారం అపహరణ
X

దిశ, నాగారం: పట్ట పగలే ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన నాగారం డివిజన్ పరిధిలోని ఎస్వి నగర్ లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం ఎస్వి నగర్ లో నివాసం ఉండే రాహుల్ ప్రైవేట్ ఉద్యోగి, శనివారం అతను డ్యూటీ కి వెళ్లగా, భార్య (ట్యూషన్ టీచర్) ఇంట్లో ఉన్నారు. సాయంత్రం సమయంలో తమ పని నిమిత్తం బయటకు వెళ్ళింది. ఉదయం నుంచి రెక్కి నిర్వహించిన ఓ మహిళ ఆమె బయటకు వెళ్ళగానే ఇంట్లోకి చొరబడి బీరువాలో 15 తులాల బంగారం, వెండి, నగదు అపహరించి బయటకు వెళ్తుండగా, పైన పోర్షన్ లో నివాసముండే పాప, ఒక బాబు ట్యూషన్ కోసమని రాహుల్ ఇంటికి వచ్చి చూడగా అనుమానాస్పదంగా గుర్తు తెలియని మహిళ ఇంట్లో నుంచి బయటకు వస్తోంది. అది గమనించిన విద్యార్థులు ఎవరని మహిళను ప్రశ్నించగా, ఇంటి పని కోసం వచ్చానని వాళ్ళని తోసేసి అక్కడి నుండి పారిపోయింది. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థులు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో వస్తువులు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. అనుమానంతో విద్యార్థులు ఆమెను వెంబడించి ఇరుగుపొరుగు వారి సహాయంతో మహిళను పట్టుకుని 100కి డయల్ చేసి కీసర పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story