నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

by Taduka Kalyani |

ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
X

దిశ, ఘట్‌కేసర్: ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదులాబాద్ డివిజన్‌లోని కొత్తగూడెంకు చెందిన జాల కేతమ్మ (70) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని ఎదులాబాద్ వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story