- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమర్జెన్సీ అని అంబులెన్స్ ఎక్కి.. అంబులెన్స్ తో జంప్
కడుపు నొప్పితో బాధపడుతుంది అని కామినేని ఆసుపత్రికి వెళ్లాలని అంబులెన్స్ కావాలంటూ కొందరు నిందితులు అంబులెన్స్ ఎక్కారు.

దిశ, మేడిపల్లి : కడుపు నొప్పితో బాధపడుతుంది అని కామినేని ఆసుపత్రికి వెళ్లాలని అంబులెన్స్ కావాలంటూ కొందరు నిందితులు అంబులెన్స్ ఎక్కారు. ఆ తరువాత డ్రైవర్ ని బెదిరించి అంబులెన్స్ తో పారిపోయారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలిగంజి నరేష్ (32) చెంగిచర్లలో ఎస్వీఎస్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 12న ఆసుపత్రి నుంచి అంబులెన్స్ కోసం ఫోన్ చేశారని.. వారి నెంబర్ లొకేషన్ ఇచ్చారు.
లొకేషన్ వద్దకు వెళ్లి సంప్రదించగా.. మహిళా కడుపునొప్పితో బాధపడుతుంది. కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఇద్దరు పురుషులు అంబులెన్స్ ఎక్కారు. ఆ మహిళా సోదరుడు, సోదరి కూడా అంబులెన్స్ ఎక్కుతారని డ్రైవర్ కి తెలిపారు. సీపీఆర్ఐ రోడ్డు నిర్మానుష్య ప్రాంతంలో అంబులెన్స్ ఆపారు. గుర్తు తెలియని మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని డ్రైవర్ ను వాహనం నుంచి బలవంతంగా దింపి ఈ వాహనం తమదేనని తాళాన్ని బలవంతంగా తీసుకొని ఐదుగురు నిందితులు అంబులెన్స్ తీసుకొని పారిపోయారు. డ్రైవర్ వెంటనే ఆసుపత్రి యజమాన్యానికి తెలియజేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






