పైపులు వేశారు....రోడ్డు వేయడం మరిచారు

by velandi.Saikiran |

మల్లాపూర్ నర్సింహా నగర్ లో ని గౌతమి మోడల్ స్కూల్(పాత ఝాన్సీ స్కూల్) వీధి లో తక్కువ సామర్థ్యం కలిగిన డ్రైనేజ్ పైప్ లైన్

పైపులు వేశారు....రోడ్డు వేయడం మరిచారు
X

దిశ, నాచారం: కొండనాలిక ముందు వేస్తే.. ఉన్న నాలుక పోయిన చందంగా తయారైంది రోడ్ల పరిస్థితి. మల్లాపూర్ నర్సింహా నగర్ లో ని గౌతమి మోడల్ స్కూల్(పాత ఝాన్సీ స్కూల్) వీధి లో తక్కువ సామర్థ్యం కలిగిన డ్రైనేజ్ పైప్ లైన్ నిత్యం పొంగి పొర్లుతుంది. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు గత నాలుగు నెలల క్రితం జలమండలి అధికారులు నూతన డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టి పనులు పూర్తి చేశారు. కానీ రోడ్డు పనులు చేపట్టకపోవడంతో గుంతల మయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటుంది.

ఇటీవల నిర్మించిన డ్రైనేజీ పనులపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అద్దంలాంటి పాత రోడ్డు తవ్వారు. పాత రోడ్డు వర్షాలు, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించేది కాదని తెలిపారు. డ్రైనేజీ పనులు చేపట్టిన కొద్ది కాలంలోనే గుంతలు ఏర్పడి, వర్షపు నీటితో మరింత దెబ్బతింటుందని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొత్త డ్రైనేజ్ ఖర్చు చేసిన డ్రైనేజ్ నిధులు వృథా అవుతున్నాయని ఆరోపించారు . ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.

పనుల నాణ్యత డోల్ల

సుమారు రూ 5 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ చేపట్టిన పనులు చేపట్టారు. అధికారులచేపట్టారు పర్యవేక్షణ కొరవడంతో.. నాసిరకం పనులతో మామా అనిపించారు. పనులు చేపట్టిననాణ్యతా లోపం లేకుంటే రోడ్డు ఈ స్థితికి చేరదని స్థానికులు మండిపడుతున్నారు.

Next Story