- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లీజు డబ్బులు అడిగితే దౌర్జన్యం
లీజు డబ్బులు అడిగితే చెవేళ్ల మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి మనుషులు మాపై దౌర్జన్యాలకు పాల్పడుతూ ,అక్రమ కేసులు బనాయిస్తున్నారన

దిశ, మేడ్చల్ బ్యూరో : లీజు డబ్బులు అడిగితే చెవేళ్ల మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి మనుషులు మాపై దౌర్జన్యాలకు పాల్పడుతూ ,అక్రమ కేసులు బనాయిస్తున్నారని అచ్యుత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది మర్రి వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు సోమవారం శామీర్ పేట మండలం, బొమ్మారాసి పేట గ్రామంలోని అర్చుట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యదర్శి డాక్టర్ కపిల్ కుమార్ శర్మతో కలిసి తమ సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటస్వామి మాట్లాడారు. అచ్యుత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థ బొమ్మరాసి పేటలోని సర్వే నెంబర్లు 387,389,392లలో ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇందులో భవనాలను నిర్మించి 2018లో లియో మెరీడియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ హోటల్స్ లిమిటెడ్(ఎల్ ఐపిహెచ్ఎల్) సంస్థ మాజీ రిజల్యూషన్ ఫ్రొపెసనల్ దేవంద్ర ప్రసాద్ ,మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి బినామీ ఎన్.వి.రామరాజు లు తమ సంస్థ భవనాలను లీజుకు తీసుకున్నట్లు చెప్పారు. అయితే మా ప్రాపర్టీని వినియోగించుకుంటున్న ఎల్ఐపిహెచ్ఎల్ సంస్థ మాకు ఇవ్వాల్సిన లీజు డబ్బులు 6 కోట్ల 61 లక్షల 25 వేల 526 రూపాయాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని, లీజు గడువు కూడా 2014,సెప్టెంబర్ 30తో ముగిసిందన్నారు. లీజు డబ్బులు చెల్లించకుండా, దౌర్జన్యంగా తమ సంస్థకు చెందిన 66,531 చదరపు అడుగుల స్థలాన్ని అక్రమించి వాడుకుంటుందని తెలిపారు. 2019 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు రూ.6.61 కోట్లు లీజు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే మా సంస్థ కార్యదర్శి డాక్టర్ కపిల్ కుమార్ శర్మ లియోనియో కార్యాలయానికి వెళ్లి లీజు డబ్బులు చేల్లించాలని, ఒప్పందాన్ని పునరిద్దురించుకోవాలని కోరితే.. వారిపై దాడి చేశారంటూ శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టించారని మర్రి వెంకటస్వామి వాపోయారు.
ముఖ్య నాయకుల పాత్ర...
రంజిత్ రెడ్డి తో పాటు మరికొందరి ముఖ్య నాయకుల పాత్ర ఉందని, భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని మర్రి వెంకటస్వామి ఆరోపించారు. తాము రంజిత్ రెడ్డి చేస్తున్న అన్యాయం విషయమై కాంగ్రెస్ నాయకులు అందరిని కలిసి న్యాయం చేయాలని కోరామన్నారు. మైనంపల్లి హనుమంతరావు ను కలవగా తమ ముందే డిసిపి కోటిరెడ్డి కి ఫోన్ చేశారని, ఇందులో ముఖ్యమంత్రి సలహాదారు వేమ నరేందర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్లు డిసిపి చెప్పారన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అరాచకాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లు వాడుకుంటున్నాడని అన్నారు.
పోర్జరీ డాక్యుమెంట్లు..
అచ్యుత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఎక్సలెన్సీ సంస్థ కార్యదర్శి డాక్టర్ డాక్టర్ కపిల్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. లియోనియో రిసార్ట్ లో తమకు 66,531 చదరపు అడుగుల స్థలం ఉందని, దీనిని దేవేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి బినామీ ఎన్ వి రామా రాజు వాడుకుంటున్నారని తెలిపారు. ఈ స్థలం లీజు అగ్రిమెంట్ కాలపరిమితి గడిచిపోయిందని, తమ స్థలాన్ని అప్పగించాలని, అద్దె చెల్లించాలని కోరగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తన సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని, ఈ విషయమై షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, కానీ తామే దౌర్జన్యానికి పాల్పడ్డామని కేసు నమోదు చేశారని వాపోయారు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించినట్లు ఆధారాలు కూడా సమర్పించామన్నారు. ఫోర్జరీ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తమకు రావలసిన అద్దె బకాయలు ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. రైతు సంఘం నాయకులు అయ్యన్న గారి రవి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ..మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. లియోనియో రిసార్ట్ కు నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి పైప్ లైన్ వేశారన్నారు. లియోనియా రిసార్ట్ గేటెడ్ కమ్యూనిటీ కాదని, అందులో ప్రైవేటు ఫ్లాట్లు కూడా ఉన్నాయని, కానీ నిబంధనలకు విరుద్ధంగా గేట్లు పెట్టి ఫ్లాట్ల యజమానులను కూడా లోపలికి అనుమతించడం లేదన్నారు. దీనిపై ఉద్యమం లేవదీస్తామన్నారు. మీడియా సమావేశంలో చక్రవర్తి పాల్గొన్నారు.






