- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోయిన్ పల్లి మార్కెట్ యార్డును సందర్శించిన విదేశీ ప్రతినిధులు
ఆసియాలోనే ఖండంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ యార్డుగా పేరొందిన బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ యార్డును వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు శనివారం సందర్శించారు.

బోయిన్ పల్లి మార్కెట్ యార్డును సందర్శించిన విదేశీ ప్రతినిధులు
మార్కెట్ లో విధివిధానాలు, క్రయవిక్రయాలపై చర్చ
దిశ తిరుమలగిరి : ఆసియాలోనే ఖండంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ యార్డుగా పేరొందిన బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ యార్డును వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు శనివారం సందర్శించారు. జాంబియా,ఇరాన్,జింబాబ్వే,కెన్యా ఇథియోపియా,నైజీరియా, దక్షిణాఫ్రికా,శ్రీలంక దేశాలకు ప్రతినిధులు మార్కెట్ లో పర్యటించారు.ఈ సందర్బంగా మార్కెట్ లో చేపడుతున్న క్రయవిక్రయాలు,మార్కెట్ లోని విధివిధానాలపై సంబంధిత అధికారులు నాయకులు వ్యాపారస్తులతో చర్చించారు. చిన్న రైతుల జీవనోపాధి మెరుగుపర్చడం,వారికి పంటలు పండించడంలో కొత్త పద్ధతులు,టెక్నాలజీలు,మార్కెటింగ్ వ్యూహాలతో శక్తివంతం చేసే అంశాలపై చర్చించారు.అ దేవిధంగా మార్కెట్ యార్డు లో నడుస్తున్న బయో ప్లాంట్ ను సందర్శించారు. ఈ-మార్కెటింగ్, డిజిటల్ ప్లాట్ ఫార్ములు, వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు,రైతు సంఘాలు, సహకార సంఘాలు, వ్యాపారవేత్తల భాగస్వామ్యం, ధరలు, నిలువ సదుపాయాలు గురించి రైతులను వ్యాపారస్తులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.






