ఘట్కేసర్ లో ఫ్లెక్సీ కలకలం..."సిగ్గు సిగ్గు" అంటూ

by velandi.Saikiran |

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వంతెనపై వెలసిన ఫ్లెక్సీ కలకలం రేపింది.

ఘట్కేసర్ లో ఫ్లెక్సీ కలకలం...సిగ్గు సిగ్గు అంటూ
X

దిశ, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వంతెనపై వెలసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తులేని వ్యక్తులు "సిగ్గు సిగ్గు" ....17 ఏళ్లుగా నిర్మాణం పూర్తి చేసుకోకపోవడం అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ ఫ్లెక్సీ చూసి స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం వంతెనను ప్రచార అస్త్రంగా మలుచుకున్నారే తప్ప... వంతెన నిర్మాణం పూర్తి చేయడం కోసం ఎవరూ పాటుపడలేదని విమర్శలు చేస్తున్నారు స్థానికులు. వ్యతిరేకత రాకముందే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story