బస్సు అగ్ని ప్రమాదంలో ఐదుగురు కుత్బుల్లాపూర్ వాసులు..?

by Kodari Anjali |   (  Updated:2025-10-24 03:37:42  IST  )

హైదరాబాద్ నుండి బెంగుళూరు బయలుదేరిన కావేరి ట్రావెల్స్ బస్సు ఆక్సిడెంట్‌లో కాలి బూడిదైన ఘటనలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వాసులు ఉన్నట్లు సమాచారం.

బస్సు అగ్ని ప్రమాదంలో ఐదుగురు కుత్బుల్లాపూర్ వాసులు..?
X

దిశ, కుత్బుల్లాపూర్: హైదరాబాద్ నుండి బెంగుళూరు బయలుదేరిన కావేరి ట్రావెల్స్ బస్సు ఆక్సిడెంట్‌లో కాలి బూడిదైన ఘటనలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వాసులు ఉన్నట్లు సమాచారం. విషాద ఘటనలో గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, బహదూర్ పల్లి ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం, సూరారంకు చెందిన ప్రశాంత్, గణేష్, చింతల్‌కు చెందిన వేణుగోపాల్ ఉన్నారు. అదే విధంగా నిజాంపేట్ క్రాస్ రోడ్డు పికప్ పాయింట్‌లో ఎక్కిన శ్రీ హర్ష, జే ఎన్ టీ యూ పికప్ పాయింట్‌లో ఎక్కిన జీ. ధాత్రి, జీ. రామారెడ్డి, అమరిత్ కుమార్‌లు ఉన్నారు. వీరు నిజాంపేట్ వాసులా లేక కూకట్‌పల్లి వాసులా సమాచారం తెలియాల్సి ఉంది. పైన తెలిపిన వారికి బస్సు సీట్ ఆలోట్‌మెంట్ నెంబర్‌లకు ఫోన్ చేయగా అందరి ఫోన్‌లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. వీరంతా ప్రమాదం నుండి బయట పడ్డారా? లేక విషాద ఘటనలో ఉన్నారా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story