- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య, భర్తల మధ్య కుటుంబ తగాదా.. ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం
భార్య, భర్త మధ్య కుటుంబ తగాద చోటు చేసుకోవడంతో మనస్థాపం చెందిన భార్య ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, జవహర్ నగర్ : భార్య, భర్త మధ్య కుటుంబ తగాద చోటు చేసుకోవడంతో మనస్థాపం చెందిన భార్య ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SHO సైదులు తెలిపిన కథనం ప్రకారం.. జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ చంద్రపురికాలనీలో సపావత్ రాజు, జ్యోతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జస్వంత్, యశ్వంత్. ఉన్ననారు. ఈ మధ్య కాలంలో భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈనెల 24న భార్య, భర్త మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన జ్యోతి మరుసటి ఇంట్లో చెప్పకుండా పిల్లలను తీసుకొని వెళ్లింది. బంధువులను, కుటుంబ సభ్యులను, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకి లభించలేదు. దీంతో భర్త రాజు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో వివాహిత..
ఇంటి నుంచి బయటికి వెళ్లిన వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ లోని గబ్బిలాల్ పేట్ జ్ఞాన్ మందిర్ పాఠశాల సమీపంలో బొత్తుల శ్రీనివాస్, భార్య మల్లీశ్వరి, కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 26న భర్త పని కోసం బయటకు వెళ్ళగా.. మల్లీశ్వరి(19) ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళి ఇంత వరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు భర్త శ్రీనివాస్ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






