బెస్ట్ అవైలబుల్ స్కూల్ దరఖాస్తు గడువు పొడిగింపు

by velandi.Saikiran |

బెస్ట్ అవైలబుల్ స్కూల్ దరఖాస్తు గడువు పొడిగించారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, దమ్మాయిగూడ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ దరఖాస్తు గడువు పొడిగించారు. 2026-27 విద్యా సంవత్సరానికి మరింత మంది అర్హులైన విద్యార్థులకు అవకాశమిచ్చే ఉద్దేశంతో గడువును 03-07-2026 వరకు పొడిగించనున్నట్లు మేడ్చల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, అవసరమైన పత్రాలతో, గడువు తేదీ లోపల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు ఫారములు తేదీ 23.06.2026 నుంచి 03.07.2026 వరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయము, మేడ్చల్-మల్కాజిరి జిల్లా, ఎస్-30, 2 వ అంతస్థు, ఐడిఓసీ భవనము, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా యందు లభిస్తాయన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారములు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయమునకు నేరుగా తేదీ. 03.07.2026 సాయంత్రం గం.5.00 లోపు సమర్పించాలని, ఆ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని అన్నారు.

Next Story