- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే వైన్ తయారీ, నిందితుడి అరెస్ట్
నకిలీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితున్ని జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం పక్కా ప్లాన్ తో పట్టుకుంది.

దిశ , కాప్రా: నేరేడ్‌మెట్ లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితున్ని జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం పక్కా ప్లాన్ తో పట్టుకుంది. నిందితుడు ఆంటోనీ పీటర్ తో పాటు పలు రకాల ఫ్లేవర్లతో తయారు చేసిన వైన్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని కాప్రా ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాప్రా ఎక్సైజ్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ జూపల్లి రవి కథనం ప్రకారం...నేరేడ్‌మెట్ కు చెందిన అంతోని పీటర్ (65) యూ ట్యూబ్‌లో చూసి గత ఏడాదిగా వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లతో వైన్ ను తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేసిన ఒక్కో బాటిల్ ను రూ. 300 లకు విక్రయిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారంతో మల్కాజ్‌గిరి డీటీఎఫ్ సీఐ భరత్ కుమార్, ఎస్సై శ్రీనివాసరెడ్డి సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. ఏడు రకాల 502 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వైన్ విలువ రూ. 1.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ఎక్సైజ్‌శాఖ ఆదాయనికి గండికొడుతున్న వైన్ ముఠా గుట్టురట్టు చేసిన డీటీఎఫ్ టీమ్‌ను మాల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ ప్రణవి, ఈఎస్ బి. హన్మంతరావు అభినందించారు. ఈ మేరకు కాప్రా ఎక్సైజ్ పోలీసులు నిందితుడు ఆంథోనీ పీటర్ పై కేసు నమోదు చేశారు.






