- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరూ రోడ్డు మీద బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను

దిశ,ఉప్పల్:నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను తెలంగాణ గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ ,రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.రోడ్డు భద్రత ,ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను తెలుసుకునేలాగా ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొదటి సారి ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై స్టూడెంట్స్ డెమోన్ స్టేషన్ నిర్వహించారు.
అనంతరం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ .. రోడ్డు భద్రతపై వారి ఆలోచనలను పంచుకున్నారు.ఇది కేవలం భద్రత కాదు, 'రోడ్ బాధ్యతని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.ఇలాంటి అవగాహన కార్యక్రమాలు స్కూళ్లలో చేపట్టడం చాలా ముఖ్యమని, ఒక జీవితాన్ని కూడా రక్షించగలిగితే అది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి అవగాహన కలుగుతుందని ఆయన ప్రశంసించారు, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో పాటుగా జై విజ్ఞాన్, జై అనుసంధాన్ లను కూడా కలుపుకోవాలని ఆకాంక్షించారు.
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ పార్క్ ప్రతి ఒక్క పాఠశాలలలో అవసరమని,ప్రాధాన్యతను మరింత స్పష్టంచేసి, విద్యార్థులు తమ కుటుంబాల్లో ఈ అవగాహనను విస్తరించడానికి ప్రయత్నించాలని కోరారు. విద్యార్థి దశలోనే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో రోడ్డు భద్రత అవగాహనపై వారోత్సవాలు ఉండేవని, ఇప్పుడు వాటి స్థానంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు తీసుకొచ్చామన్నారు. రవాణా శాఖలో కొత్తగా స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పాటించి.. మీ తల్లిదండ్రులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయగీతాలాపనలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ సురభివాణి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్,తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్,ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమురయ్య,ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత,మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్,ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈవో మల్కా యశస్వి రవాణా శాఖ ఉన్నతాధికారులు,ట్రాఫిక్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






