ప‌ర్యావ‌ర‌ణ‌ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ భాగస్వాములు కావాలి

by Ratna Kumari |   (  Updated:2026-03-10 15:42:24  IST  )

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం అధికారుల బృందంతో కలిసి ఆయన కాప్రాలో పర్యటించారు.

ప‌ర్యావ‌ర‌ణ‌ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ భాగస్వాములు కావాలి
X

దిశ , కాప్రా : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం అధికారుల బృందంతో కలిసి ఆయన కాప్రాలో పర్యటించారు. ఈ సందర్భంగా కాప్రా చెరువును సందర్శించి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, ఇతర విభాగాల అధికారుల బృందంతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూగర్భ నీటి వనరులకు ప్రధానమైన చెరువులను స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

వరద నీరు నేరుగా వచ్చేలా కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే చెరువు పరిసర ప్రాంతాలలో చెత్తా చెదారం పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలన్నారు. ఇక శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధికారులతో కలిసి కాప్రా చెరువు పరిసరాలలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్ధాలను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తొలగించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రమేష్ బాబు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిఈలు బాలకృష్ణ, రవి, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, 125 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Next Story