- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు మానుకోవాలి..
by Taduka Kalyani |
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు వీనస్ మేరీ అన్నారు.

X
దిశ, అల్వాల్: హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు వీనస్ మేరీ అన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని చేసిన ఆరోపణలకు నిరసనగా వెంకటాపురం చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వీనస్ మేరీ మాట్లాడుతూ ప్రజల నుంచి కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈటల రాజేందర్ కు ప్రజల్లో ఎంతో కొంత పేరుండేదని ఇలాంటి ఆరోపణల ద్వారా ఆయనను ఆయనే దిగజార్చుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ రెడ్డి, శివకుమార్, సాయికుమార్, సత్యనారాయణ, నిరంజన్, సతీష్, శివశంకర్, రాజన్, శ్రీనివాస్, పద్మ, ఆశారాణి తదితరులు పాల్గొన్నారు.
Next Story






