పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్ఐ నాగేశ్వరరావు

by Batti.Sumithra |

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగేశ్వరావు అన్నారు. ఆ

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్ఐ నాగేశ్వరరావు
X

దిశ, ఘట్కేసర్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగేశ్వరావు అన్నారు. ఆదివారం పోచారం డివిజన్, ఇస్మాయిల్ ఖాన్ గుడా శ్రీనివాస నగర్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఎస్ఐ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు కాలనీవాసులను అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్క నాటి మొక్కను పెంచే బాధ్యత తీసుకోవాలని కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వల్లమల్ల ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఇటికల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బద్రి హేమంత్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొంగుల బాలేష్, మహిళలు పాల్గొన్నారు.

Next Story