నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం: ఉపాధి కల్పన అధికారిణి

by Kodari Anjali |

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎం. రాధిక మేడ్చల్ ఐడీఏలోని షాహనా బయోటెక్ పరిశ్రమను సందర్శించారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం: ఉపాధి కల్పన అధికారిణి
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎం. రాధిక మేడ్చల్ ఐడీఏలోని షాహనా బయోటెక్ పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యంతో సమావేశమై అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీలు, అవసరమైన అర్హతలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎం. రాధిక మాట్లాడుతూ, పరిశ్రమలతో సమన్వయం చేసుకుని జిల్లాలోని నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అర్హులైన యువత జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Next Story