ప్రమాదకర ప్రాంతంలో ఉద్యోగులు..

by Batti.Sumithra |

మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

ప్రమాదకర ప్రాంతంలో ఉద్యోగులు..
X

దిశ, మేడిపల్లి : మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు తంబ్ అటెండెన్స్ కోసం రోజు రెండు పూటలా కార్యాలయానికి వేయాల్సి ఉంటుంది. కానీ బయోమెట్రిక్ మిషన్ పక్కనే కరెంటు వైర్లు ప్రమాదకరంగా ఏ విధమైన రక్షణ లేకుండా దర్శనమిస్తున్నాయి. కమిషనర్ ఆఫీస్ కి రోజు ఎంతోమంది ప్రజలు, నాయకులు, అధికారులు వస్తు పోతుంటారు.

ఇక్కడ కరెంట్ వైర్లకు పక్కనే రోజు కమిషనర్ అటెండర్ విధులు నిర్వహిస్తుంటాడు. ఏదైనా అనర్థం జరిగితే బాధ్యులు ఎవరు ? ఈ విషయం పై గత కమిషనర్ కు ఎన్నిసార్లు తెలియజేసినా, మీడియాలో వార్తా కథనాలు వచ్చినా స్పందించలేదు. కొత్తగా వచ్చిన కమిషనర్ భరత్ వంశీకృష్ణ అన్న ఈ సమస్య పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారా.. లేక కాలయాపన చేస్తారో వేచి చూడాలి.

Next Story