అనారోగ్యంతో వృద్ధుడు మృతి

by velandi.Saikiran |

బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 26వ బస్ స్టాప్ వద్ద గోవా కు చెందిన జోసఫ్(60)అనే వృద్ధుడు మృతి చెందినట్లు బోయినపల్లి ఎస్సై శివశంకర్ తెలిపారు.

అనారోగ్యంతో వృద్ధుడు మృతి
X

దిశ, తిరుమలగిరి: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 26వ బస్ స్టాప్ వద్ద గోవా కు చెందిన జోసఫ్(60)అనే వృద్ధుడు మృతి చెందినట్లు బోయినపల్లి ఎస్సై శివశంకర్ తెలిపారు. ఓల్డ్ బోయినపల్లికి చెందిన రామ్ కిషోర్ కుమార్ కు చెందిన ఓల్డ్ బోయిన్‌పల్లిలోని బస్ పార్కింగ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.కాగా మృతుడు మద్యానికి బానిసై ఉద్యోగం సరిగ్గా చేస్తుండక పోయేవాడని తెలిపారు.దీంతో ఈనెల 25న అతనికి వేతనం ఇచ్చి ఉద్యోగంలోని నుండి తీసివేశాడు.ఈనెల 27న అతను బస్ స్టాప్ వద్ద అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందాడని తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story