సూరానా గ్రూప్‌ చైర్మన్‌ ఇంట్లో ఈడీ సోదాలు.. ఏం దొరికాయో తెలుసా..?

by Naveena |   ( Updated:2025-04-16 09:33:18.0  )
సూరానా గ్రూప్‌ చైర్మన్‌ ఇంట్లో ఈడీ సోదాలు.. ఏం దొరికాయో తెలుసా..?
X

దిశ ,తిరుమలగిరి : నగరంలో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. సురానా, సాయి సూర్య డెవలపర్స్‌ లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ సురానా గ్రూప్స్ అధినేత నరేంద్ర సురానా ఇంట్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు ఆకస్మికంగా సోదాలు జరుపుతున్నారు. ఉదయం 4గంటల నుంచి నరేంద్ర సురాణా ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మైనింగ్,కాపర్,సోలార్ వ్యాపారాలలో ఉన్న సూరన గ్రూప్స్ పెద్దఎత్తున మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించి, ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ బ్యాంకు నుంచి దాదాపు 3వేల కోట్లు రుణాలు తీసుకుని ఆ రుణాల చెల్లింపు ఎగవేతకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్,జూబ్లీహిల్స్‌,మాదాపూర్‌ల లోని సంస్థ కార్యాలయాలలో చెన్నై ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సురానా గ్రూప్‌తో పాటు సాయిసూర్య డెవలపర్స్‌పై సంస్థ ఎండి సతీష్‌చంద్ర గుప్తా నివాసంలోను సోదాలు చేశారు. సురానా గ్రూప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య హైదరాబాద్‌లో పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తేలడంతో.. ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ 2సంస్థలు చెన్నై ఎస్బీఐ నుంచి వేలకోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే తిరిగి చెల్లించకపోతుండడంతో..2012లో సురానా గ్రూప్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. అదేవిదంగా తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా నిలువ ఉంచిన 400కేజీల బంగారం సిబిఐ స్వాధీనం చేసుకుంది. కాగా గతంలో సిబిఐ కస్టడీ నుండి103కెజీల బంగారం మాయమైందని,ఈ103కిలోల బంగారం ఏమైందో తేల్చాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రియల్‌ ఎస్టేట్‌,ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్‌ సెక్టార్‌లలో సురానా గ్రూప్‌ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది.



Next Story

Most Viewed