- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి : సినీ నటుడు మంచు మనోజ్
రక్త దానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసి ప్రాణ దాతలుగా మారాలని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు.

దిశ, కూకట్పల్లి : రక్త దానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసి ప్రాణ దాతలుగా మారాలని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. ఈ నెల 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ అభిమాన సంఘం నాయకులు షేక్ సత్తార్, అర్కే. చౌదరిల ఆధ్వర్యంలో కేపీహెచ్బీ కాలనీ కమ్యునిటి హాల్లో ఆదివారం నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ప్రారంభించారు.
రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ ఇన్చార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, ప్రముఖ సినీ నటుడు భవాని చౌదరిలు పాల్గొన్నారు. రక్త దాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత, మంచు మనోజ్ అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీనివాస్, కట్టా నర్సింగరావు, కొల్లా శంకర్, కొప్పిశెట్టి దినేష్ కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, రాజకీయ పార్టీ నాయకులు, కాలనీ వెల్ఫేర్ సంఘాల సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.






