- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసరగుట్ట హుండీ ఆదాయం ఎంతో తెలుసా
మహా శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర భవానీ స్వామి దేవస్థానానికి రూ. 92,49,961 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ తెలిపారు.

దిశ,కీసర : మహా శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర భవానీ స్వామి దేవస్థానానికి రూ. 92,49,961 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ తెలిపారు. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ. 63,51,060 ఆదాయం రాగా, హుండీలో రూ. 28,98,901 సమకూరినట్టు తెలిపారు. మహా మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మొత్తం ఆదాయాన్ని స్వామి పేరిట కీసర ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
గతేడాది బ్రహ్మోత్సవాల కంటే ఈసారి సుమారు రూ. 14,70,436 అధికంగా ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఓ సుధాకర్ రెడ్డి, ఆలయ ట్రస్టు ఫౌండర్ కుటుంబ సభ్యులు తటాకం రమేష్ శర్మ, తటాకం వెంకటేష్ శర్మ, తటాకం ఉమాపతి శర్మ, తటాకం నాగ లింగం శర్మ, తటాకం శ్రీనివాస్ శర్మ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు నల్లోల్ల కుమార్, నల్ల మధుసూదన రెడ్డి, మొరుగు ముత్యాలు, సగ్గు అనితా, కౌకుట్లా కృష్ణారెడ్డి, రెడ్డబోయిన ప్రవీణ్ కుమార్, కందాడి రాజీ రెడ్డి, పోషబోయిన రాజు, జూపల్లి సాయి పాల్గొన్నారు.






