- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనాత్మక కథనాలతో దిశ ముందంజ : శంభీపూర్ రాజు
సంచలనాత్మక కథనాలతో దిశ దిన పత్రిక అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందిందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.

దిశ, దుండిగల్ : సంచలనాత్మక కథనాలతో దిశ దిన పత్రిక అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందిందని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. దిశ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం శంభీపూర్ గ్రామంలో ఉన్న తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నిర్మొహమాటంగా వెలుగులోకి తెస్తూ ప్రజాపక్షంగా నిలుస్తోన్న దిశ దినపత్రిక తక్కువ కాలంలోనే విశేష పాఠకాదరణను సంపాదించిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజ సంఘటనలను ప్రతిబింబిస్తూ వార్తలను ప్రచురించడం ద్వారా దిశ ప్రజల మద్దతు సాధించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు అండగా, బలహీన వర్గాల గొంతుకగా మారే వార్తలకు ఎల్లప్పుడూ తన పూర్తి సహకారం, ఆదరణ ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హామీ ఇచ్చారు. దిశ మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ను మేడ్చల్ జిల్లా దిశ బ్యూరో చీఫ్ కల్లేపల్లి రవిచంద్ర శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి.పద్మారావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కె.మల్లేష్, గుడాల భాస్కర్ గుప్తా, వీరేష్ ముదిరాజ్, కుత్బుల్లాపూర్ ఆర్సీ ఇంచార్జ్ లింగుస్వామి రిపోర్టర్ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.






