- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. టెంపుల్ బస్టాప్‌లో అక్రమ నిర్మాణం సీజ్
by Chintha Aamani |
మూసాపేట్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పై దిశ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది.

X
దిశ, కూకట్పల్లి: మూసాపేట్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పై దిశ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీంతో స్పందించిన సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు గురువారం అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్‌లోని ఈడబ్ల్యూఎస్ 1076 లో 66 గజాలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతుండటాన్ని ‘దిశ’ వెలికి తీసి కథనాలు ప్రచురించడంతో స్పందించిన జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, డీసీ ఎస్లావత్ల ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్మాణాన్ని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ ఏసీపీ కరుణాకర్ రెడ్డి, సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






