మొక్కలు నాటిన డైరెక్టర్ బలగం వేణు

by velandi.Saikiran |

కీసర గుట్టలో డైరెక్టర్ బలగం వేణు మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన డైరెక్టర్ బలగం వేణు
X

దిశ, కీసర : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాగంగా హరితసేన మహిళా విభాగం అధ్యక్షరాలు నాయకపు మాధురి వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం కీసర గుట్టలో డైరెక్టర్ బలగం వేణు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బలగం వేణు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల‌న్నారు. త‌న‌కు కీసర గుట్టలో మొక్కలు నాటే అవకాశం కల్పించిన మాజీ సర్పంచ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహిళా అధ్యక్షురాలు మాధురికి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కీసర గుట్ట యువజన నాయకులు రాగుల శ్రీనివాస్, సంతోష్,రమేష్, దశరథ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story