అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి

by velandi.Saikiran |

మల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సత్వరంగా పూర్తి చేయాలని

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి
X

దిశ, నాచారం : మల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సత్వరంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నాగేందర్ ని కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఈఈ కలిసిన నాయకులు నెమలి అనిల్ వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ డివిజన్ లో జరుగుతున్న సిసి రోడ్లు, బీటీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులపై పురోగతి ని అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈ ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు పనులపై ఆదేశాలు ఇచ్చారు.

Next Story