- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలతోనే అభివృద్ధి సాధ్యం : ఎంపీ ఈటల రాజేందర్
దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లోని కాలనీలన్ని వేగంగా అభివృద్ధి చెందాలంటే

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లోని కాలనీలన్ని వేగంగా అభివృద్ధి చెందాలంటే బోర్డు పాలకవర్గం ఉంటేనే సాద్యపడుతుందని మల్కాజ్ గిరి ఎంపి ఈటెల రాజేందర్ అన్నారు.బోర్డు నామినేటెడ్ సభ్యురాలు తన పదవీకాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఎనిమిది వార్డులలోని వివిధ కాలనీలు అభివృద్ధి సభ్యురాలితోనే సాధ్యం కాదని,పాలకవర్గ ఎన్నికలు జరిగితేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.కంటోన్మెంట్ లోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి అరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 3వందల కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు.బోర్డు సభ్యురాలు గత10నెలల కాలంలో సుమారు15కోట్ల రూపాయలతో కాలనీల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బోర్డు సభ్యురాలు చేసిన వివిధ అభివృద్ధి పనులపై విడియో చిత్రీకరణ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక,నాయకులు టోపి శంకర్,బానుక మల్లికార్జున్,బిఎన్ శ్రీనివాస్,బానాల శ్రీనివాస్,మాణిక్ రెడ్డి,రాకేష్ పాల్గొన్నారు.






