- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ ఎఫ్ సీ) ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా దేవకుమార్ ఘన విజయం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ ఎఫ్ సీ) ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ (ఐడబ్ల్యూయూ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా టీఆర్ దేవకుమార్ (బెల్ ప్యానెల్), ప్రధాన కార్యదర్శిగా టి.రతన్ సింగ్ (టైగర్ ప్యానెల్ ) ఘన విజయం సాధించారు.

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ ఎఫ్ సీ) ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా దేవకుమార్ ఘన విజయం
ప్రధాన కార్యదర్శిగా టీ.రతన్ సింగ్ గెలుపు
దిశ, కాప్రా: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ ఎఫ్ సీ) ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ (ఐడబ్ల్యూయూ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా టీఆర్ దేవకుమార్ (బెల్ ప్యానెల్), ప్రధాన కార్యదర్శిగా టి.రతన్ సింగ్ (టైగర్ ప్యానెల్ ) ఘన విజయం సాధించారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్ఎఫ్సీ సంస్థలో వివిధ పదవులకు జరిగిన ఎన్నికల్లో టైగర్ ప్యానెల్ నుంచి 11 మంది, బెల్ ప్యానెల్ నుంచి నలుగురు విజయం సాధించారు. అధ్యక్షుడిగా టీఆర్ దేవకుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎస్.మురళీధర్, ఉపాధ్యక్షులుగా ఎండీ యాకూబ్, కే.కోటిబాబు, కే.శ్రీనివాస్, హెచ్.హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా పి.రతన్ సింగ్, సహాయ కార్యదర్శులుగా, ఏఎస్వీ రంగనాథరావు, పి.రమేష్, బి.కిరణ్ కుమార్, కార్యనిర్వాక కార్యదర్శులుగా అరివెళ్ల అశోక్, నాగేందర్ జటావత్, గౌరవ్ శుక్లా, పి.నరేష్ కుమార్, కోశాధికారిగా కె. శ్యామ్ రావు గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.






