- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధునిక టెక్నాలజీతో... దంతవైద్యం అందజేయాలి
ఆధునిక టెక్నాలజీతో కూడిన దంత వైద్యం ప్రజలకు అందజేయాలని, ఓర్పు గా రాణిస్తేనే సమాజంలో ప్రత్యేకను చాటుకుంటారని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పోటీపడుతూ నిత్య విద్యార్థి ముందడుగు వేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

దిశ, దమ్మాయిగూడ : ఆధునిక టెక్నాలజీతో కూడిన దంత వైద్యం ప్రజలకు అందజేయాలని, ఓర్పు గా రాణిస్తేనే సమాజంలో ప్రత్యేకను చాటుకుంటారని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పోటీపడుతూ నిత్య విద్యార్థి ముందడుగు వేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెన్స్ (ఏసీడీఎస్)లో స్నాతకోత్సవ వేడుకలు శనివారం దంతవైద్య కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో పండుగలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భట్టి విక్రమార్కహాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ దంత వైద్యం అతి సున్నితమైందని, యువ వైద్యులు ఏజెన్సీలాంటి ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందజేయాలని, ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీఠ వేస్తుందని అన్నారు. వైద్య విద్యను ప్రజలకు మరింత దగ్గర చేయాలని పేర్కొన్నారు. అనంతరం బీడీఎస్, ఎండీఎస్ కోర్సును పూర్తి చేసిన పీజీ, డిగ్రీ విద్యార్థులకు అవార్డుతో పాటు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఉపకులపతి రమేష్ రెడ్డి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, ప్రిన్సిపల్ మమతా కౌశిక్, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాస్, వెంకటేష్ పాల్గొన్నారు.






