- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నామని దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పా రామారావు పేర్కొన్నార

దిశ, దమ్మాయిగూడ: డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నామని దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఠాకూర్ కాలనీలో రూ. 8.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ మురుగు నీటి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఠాకూర్ కాలనీలో కొన్ని ఏళ్లుగా నెలకొని ఉందని, మురుగు కాల్వలు సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షాల సమయంలో వరద నీరు రోడ్లపై పారడంతో తీవ్ర అపరిశుభ్రత నెలకొందని పేర్కొన్నారు.
దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండే వారని ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. పనులు నాణ్యత ప్రమాణాలతో త్వరీతగతిన పూర్తి చేసి భూగర్భ డ్రైనేజీ ద్వారా మురుగు నీరు, వరద నీరు వెళ్లేలా చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, మాజీ వార్డు సభ్యుడు మణిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్ సింగ్, దిలీప్, బజరంగ్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, కిషన్ ప్రసాద్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






