పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

by velandi.Saikiran |

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మీర్ పేట్‌ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ సూచించారు

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
X

దిశ, నాచారం: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మీర్ పేట్‌ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ సూచించారు. డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ కాలనీ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. రోడ్డు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ సమయంలో తగు పరిమాణంలో సిమెంటు, కంకర, ఇసుకల నిబంధనల మేరకు తగిన మిశ్రమాలతో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారుకు కార్పొరేటర్ సూచించారు. అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మ్యాన్హోల్స్ చుట్టూ కాంక్రీట్ వేసి దృఢంగా ఉండేలా చూడాలన్నారు. భారీ వాహనాలు వచ్చినప్పుడు తొందరగా పాడవకుండా రోడ్డు నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుదాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, కాలనీ ప్రతినిధులు దాస్, మురళీ చారి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story