- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి హానికరం: అదనపు కలెక్టర్
పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల శరీరంలో దృఢత్వాన్ని కొల్పోతారని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల శరీరంలో దృఢత్వాన్ని కొల్పోతారని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ అన్నారు. ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధ్యక్షతన సోమవారం తన చాంబర్ లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డా. చంద్రకళ పొగాకు వినియోగానికి అలవాటు పడడానికి గల కారణాలు, పొగాకు వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, జిల్లాలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద చేపడుతున్న చర్యలు, వివిధ శాఖల విధులు, బాధ్యతలు మరియు కార్యక్రమంలో వారి భాగస్వామ్యం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. కౌశిక్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్, పల్స్ పోలియో కార్యక్రమం మరియు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, పొగాకు వినియోగించకుండా విద్యాసంస్థలలలో విస్తృతంగా అవగాహన,కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
జాతీయ వ్యాధినిరోధ టీకాల కార్యక్రమం కింద..
పాన్ షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీస్ శాఖ నిఘా పటిష్టంచేయాలన్నారు. డయేరియా కార్యక్రమంలో భాగంగా జూన్ 1 నుండి జూలై 15 వరకు సన్నాహక దశ, జూన్ 16 నుండి జూలై 31 వరకు అమలు దశగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ 28న నిర్వహించనున్న జాతీయ వ్యాధినిరోధ టీకాల కార్యక్రమం కింద పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ సాంబశివరావు, డీటీడీఓ పద్మజ, అడల్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి, డీడబ్ల్యూఓ జ్యోతి, సీఈఓ కాంతమ్మ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గంగాధర్, డీఈ ఓ రేణుకాదేవి, స్కూల్ ఎడ్యుకేషన్ రమాదేవి, డీసీడీఓ వినోద్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నీలేశ్వర్, ఆరోగ్య శాఖకు చెందిన ప్రోగ్రామ్ అధికారులు డా. శ్రీదేవి, డా. చంద్రకళ, డా. కౌశిక్, డా. లావణ్య, డా. నాగరాజు, డిప్యూటీ డెమో వసంతారెడ్డి, ఉషారాణి, ఉమాపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






