- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘట్కేసర్ వంతెన నిర్మాణంపై వంతుల వారీగా రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు.

దిశ, ఘట్ కేసర్ : జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘట్కేసర్ వంతెన నిర్మాణంపై వంతుల వారీగా రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వంతెన నిర్మాణాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకున్నారే తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం కోసం పార్టీలు మారుతూ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సొంత పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి గురించి పట్టించుకునే స్థితిలో లేనట్టుగా ఉందని అన్నారు. ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గాలుగా ఏర్పడి అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక ఘట్కేసర్ జేఏసీని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసమే ఆరాటపడుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే కర్రు కాల్చి వాతలు పెడతారని వ్యాఖ్యలు చేశారు. ఘట్కేసర్ వంతెన నిర్మాణం పూర్తి విషయంలో భారతీయ జనతా పార్టీ నిజాయితీగా, నిబద్ధతతో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు మహేందర్, శోభన్ బాబు, మమత శర్మ పాల్గొన్నారు.






