- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు: రేవంత్ రెడ్డి
పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

దిశ, కూకట్పల్లి: తల తాకట్టు పెట్టైనా, అభివృద్ధి పనులకు నిధులు సమీకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో హైడ్రా ఆధ్వర్యంలో పునర్జీవం పోసుకున్న నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్ కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, డిప్యుటి స్పీకర్ రాంచంద్రనాయక్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన తల తాకట్టు పెట్టైన నిధులు సమకూరుస్తానన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ప్రజా ప్రతినిధి ఉన్నా, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలలో నూటికి నూరు శాతం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఐదేళ్లు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడుగా అన్ని 7 నియోజకవర్గాలలోని కాలనీలు, బస్తీలు చూసాను, ఇక్కడున్న కార్పొరేటర్, కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా తనకు వ్యక్తి గతంగా పరిచయాలు ఉన్నాయని అన్నారు.
యాక్టివ్గా పని చేసే కమిషనర్లను నియమించామని, చెరువులలో భూముల కోల్పోయిన వారికి నష్ట పరిహారాన్ని అందే విధంగా చూస్తామని తెలిపారు. ఎంపీగా చేయలేని పనులను సీఎం హోదాలో పూర్తి చేస్తానని ప్రకటించారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, కుత్బుల్లాపూర్ ఇన్చార్జి కూన శ్రీశైలం గౌడ్, గాలి బాలాజీ, శేరి సతీష్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, గొట్టిముక్కల దేశాల్, సాధు ప్రతాప్ రెడ్డి, రంగ మోహన్, కొప్పిశెట్టి దినేష్ తదితరులు పాల్గొన్నారు.






