కీసరలో రెండు వర్గాల మధ్య గొడవ...22 మందిపై కేసు

by velandi.Saikiran |

కీసరలో శనివారం రెండు వర్గాల మధ్య గొడవ కాస్త ముదిరి కులాల మధ్య చిచ్చు రేపింది. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం బుధవారం

కీసరలో రెండు వర్గాల మధ్య గొడవ...22 మందిపై కేసు
X

దిశ, కీసర : కీసరలో శనివారం రెండు వర్గాల మధ్య గొడవ కాస్త ముదిరి కులాల మధ్య చిచ్చు రేపింది. కీసర పోలీసులు తెలిపిన ప్రకారం బుధవారం సాయంత్రం, కీసర గ్రామానికి చెందిన ముద్దం బాలయ్య తన ఆటో తీసుకొని, ఇంటికి వెళ్తున్న సమయంలో దినేష్, బాలయ్యకు మధ్య గొడవ అయింది.స్నేహ కాలానికి చెందిన దినేష్...ఓ షాప్ కు తన చెల్లితో బైక్ పై వెళ్ళాడు. ఆటోలో ఇంటికి వెళ్తున్న బాలయ్య... రోడ్డుకు అడ్డుగా ఉన్న‌ బైక్ తీయమని దినేష్ కు సూచించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఇంతలో ముద్దం బాలయ్య కొడుకు దినేష్ పై చేయి చేసుకున్నాడు. అనంతరం ఒకరిపై మ‌రొక‌రు కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అనంత‌రం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకునే సమయంలో పరస్పర వాదనలు చేసుకున్నారు. ఇక‌ ఒక్క వర్గం చాకు, మరో వర్గం కర్ర‌లు తీసుకొని దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు రెండు వర్గాలకు సంబంధించి సుమారు 22 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Next Story