దేశంలో ప‌లు సంస్థ‌ల‌కు సీఐఎస్ఎఫ్ ర‌క్ష‌ణ‌గా నిలుస్తోంది : ప్రోటీక్ కుమార్ చక్రబోర్తి

by Ratna Kumari |

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసీఐఎల్ సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ప్రోటీక్ కుమార్ చక్రబోర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు.

దేశంలో ప‌లు సంస్థ‌ల‌కు సీఐఎస్ఎఫ్ ర‌క్ష‌ణ‌గా నిలుస్తోంది : ప్రోటీక్ కుమార్ చక్రబోర్తి
X

దిశ‌, కాప్రా : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 57వ సిఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని... సీఐఎస్ఎఫ్ ఎన్ఎఫ్సి యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం డీఏఈ కాలనీలోని సీఐఎస్ఎఫ్ మైదానంలో వేడుకలను నిర్వహించారు. ఈసీఐఎల్ సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ప్రోటీక్ కుమార్ చక్రబోర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ జవాన్లు కవాత్ నిర్వహించి ప్రోటీక్ కుమార్ చక్రబోర్తి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ దేశంలో పరిశ్రమలు, విమానాశ్రయాలు, అత్యుత్తతమైన సంస్థల రక్షణకు సీఐఎస్ఎఫ్ విశిష్ట సేవలను అందిస్తుందన్నారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ శంకరరావు బైరెడ్డి మాట్లాడుతూ 1969 మార్చ్ 10న సీఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. గత 57 సంవత్సరాలుగా దేశ రక్షణకు సీఐఎస్ఎఫ్ బలగాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ బలగాలు సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు, డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో... సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ జయశంకర్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ అరుణేష్ రస్తోగి, పి. లక్ష్మి, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ అధికారులు పాల్గొన్నారు.

Next Story