- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కిల్స్ క్రిటికల్స్.. సవాలక్ష సమస్యలు
జీహెచ్ఎంసీ సర్కిల్స్ .. క్రిటికల్స్ గా మారాయి. జోనల్, సర్కిళ్లలో కమిషనర్లను నియమించినా సిబ్బంది కొరత వేధిస్తోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : జీహెచ్ఎంసీ సర్కిల్స్ .. క్రిటికల్స్ గా మారాయి. జోనల్, సర్కిళ్లలో కమిషనర్లను నియమించినా సిబ్బంది కొరత వేధిస్తోంది. అవసరమైన సిబ్బందిని కేటాయించకపోవడంతో పాలన కుంటుపడనుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా మూడు జోనల్ 21 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. వీటికి కమిషనర్లను నియమించారు. కానీ ఆయా కార్యాలయాల్లో సరిపడ సిబ్బందిని నియమించలేదు. దీంతో పౌర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీల పరిధిలోని స్థిర, చరాస్తులు, భవనాలు, లే ఔట్ అనుమతులు, పన్నుల వసూలుకు సంబంధించిన ఫైళ్లను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమీషనర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. కొత్త సర్కిల్ కార్యాలయాల్లో కమీషనర్, మేనేజర్ వంటి ఒకటి రెండు మినహా మిగితా పోస్టుల్లో సమీప మున్సిపాలిటీలు, గతంలో విలీనమైన గ్రామ పంచాయితీ ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు కొత్త మున్సిపాలిటీలకు అరుదుగా వచ్చి వెళ్తుతున్నారు.కొన్ని సర్కిళ్లలో మేనేజర్,డివిజనల్,అసిస్టెంట్ ఇంజనీర్లు,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి పొస్టులు భర్తీ కాకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రజలు వాపోతున్నారు. ఒకపోతే కొత్తగా ఏర్పాడిన కార్యాలయాల్లో ఫర్నిచర్ కొరత వేధిస్తోంది. రికార్డులను భద్ర పరచడం సమస్యగా మారంది. మున్సిపల్ కార్యాలయాలకు వచ్చే వారు కనీసం కూర్చునే పరిస్థితి లేదు.
కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఇవే..
మల్కాజ్‌గిరి : కీసర, అల్వాల్, బోయిన్‌పల్లి, మౌలాలి, మల్కాజ్‌గిరి
ఉప్పల్ : ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్
కూకట్‌పల్లి : మాదాపూర్, ఆల్విన్‌కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్
కుత్బుల్లాపూర్ : చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్






