- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీర్జాదిగూడలో చైన్ స్నాచింగ్ కలకలం..!
మహిళా మెడలో నుంచి బంగారు మంగళ సూత్రాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపుతుంది.

దిశ, మేడిపల్లి : మహిళా మెడలో నుంచి బంగారు మంగళ సూత్రాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపుతుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్ కాలనీ రోడ్ నంబర్-1లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడి మాణిక్యప్ప సతీమణి కావడి అనిత (56) గురువారం సాయంత్రం ఇంటి ముందు గల రోడ్డు పై వాకింగ్ చేస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మాయ మాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కెళ్లారు. బాధితురాలి మెడలో ఉన్న మంగళసూత్రం లో రెండు పుస్తెలు, గుండ్లు, లక్ష్మీ బిళ్ల ఉండగా, మొత్తం సుమారు ఐదు తులాల బంగారం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం నిందితులు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు కావడి మాణిక్యప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలనీలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






