- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్వకం.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
నిజాంపేట్‌లో శ్రీరతన్ కన్‌స్ట్రక్షన్ చేష్టలకు గురువారం రాత్రి భయానక వాతావరణం నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్‌లో శ్రీరతన్ కన్‌స్ట్రక్షన్ చేష్టలకు గురువారం రాత్రి భయానక వాతావరణం నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎండీఏ అనుమతులతో సుమారు 22 ఫ్లోర్లతో నిర్మిస్తున్న శ్రీరతన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అపార్ట్‌మెంట్ సముదాయాల నిర్మాణం ఓ పక్క చేపడుతూనే మరో పక్క క్లబ్ హౌస్ నిర్మాణానికి పూనుకుందని స్థానికులు తెలిపారు. ఈ నిర్మాణం కోసం భారీ సెల్లార్ తవ్వకం గురువారం మొదలుపెట్టింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నిబంధనలు ప్రకారం వర్షాకాలంలో ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కూడా సెల్లార్ తవ్వకాలు చేపట్టరాదు. గతంలో వర్షాకాలంలో నిబంధనలకు విరుద్ధంగా తీసిన సెల్లార్ల వల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది.
నిబంధనలు గాలికి..
నిబంధనలు గాలికి వదిలేసిన శ్రీరతన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ గురువారం సెల్లార్ తవ్వకాలను చేపట్టి స్థానికంగా భయానక వాతావరణం సృష్టించింది. ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా భారీ స్థాయిలో సెల్లార్ తవ్వకానికి సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీ పూనుకోవడంతో పక్కనే గల ధీక్షిత్ ఎంక్లేవ్ అపార్ట్‌మెంట్ సముదాయ ప్రహరీ కూలడంతో పాటు కొన్ని కార్లు ధ్వంసం అయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సెల్లార్ తవ్వకం చేపట్టవద్దూ అని స్థానిక అపార్ట్మెంట్ నివాసితులు శ్రీరతన్ కన్‌స్ట్రక్షన్ బాధ్యులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రహరీ కూలి కార్లు డ్యామేజ్ కావడంతో పాటు అపార్ట్‌మెంట్ పిల్లర్లు కదిలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీ చట్టవ్యతిరేక చర్యలపై బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పనులు ఆపి వేయించారు. శ్రీరతన్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






