- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ స్థలంలో అక్రమ గేటు ఏర్పాటు.. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో అక్రమంగా గేటు ఏర్పాటు చేసిన ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ,మేడ్చల్: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో అక్రమంగా గేటు ఏర్పాటు చేసిన ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వి. రేణుక ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 329(3), 324(4) రెడ్ విత్ 3(5) కింద క్రైం నం.692/2026 నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. గత నెల 23న కార్యాలయ ప్రహరీ గోడను కూల్చి అక్రమంగా గేటు ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా, అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో గేటును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తిపై అక్రమ చొరబాటు, అనధికార నిర్మాణం జరగడంతో బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ గేటును తొలగించి ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని ఫిర్యాదుదారు కోరారు. కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






