- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్కాజిగిరి కార్పొరేటర్ పై కేసు నమోదు.. ఎందుకంటే..?
by Naveena |
మల్కాజిగిరి కార్పొరేటర్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

X
దిశ, మల్కాజిగిరి ; మల్కాజిగిరి కార్పొరేటర్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జీహెచ్ఏంసీలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ పై చేయిచేసుకున్నాడని అందిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే .. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివపురి కాలనీలో ఓ మహిళ బజారు చెట్లు కటింగ్ చేయాలని నెల రోజుల కిందట ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడే 11 కేవీ విద్యుత్ తీగలున్నాయని, దీంతో చెట్ల కటింగ్ చేయడం కుదరలేదని వెంకటేష్ కార్పొరేటర్ కు వివరించారు. అయితే కార్పొరేటర్ తన కార్యాలయానికి పిలిపించుకుని ఎందుకు చెట్ల కొమ్మలు కట్ చేయలేదని వెంకటేష్ పై చేయి చేసుకున్నారు. విధుల్లోఉన్న వెంకటేష్ పై చేయిచేసుకుని బెదిరించడంతో.. కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






