మందుబాబులకు అడ్డాగా కాప్రా సర్కిల్ కార్యాలయం

by Malleboina Mahesh |

ప్రభుత్వ కార్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. మహానగర పాలక సంస్థ కాప్రా సర్కిల్ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని సిబ్బందే మందు, విందులు చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మందుబాబులకు అడ్డాగా కాప్రా సర్కిల్ కార్యాలయం
X

దిశ, కాప్రా: ప్రభుత్వ కార్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. మహానగర పాలక సంస్థ కాప్రా సర్కిల్ కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని సిబ్బందే మందు, విందులు చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీల పేరిట ఏకంగా మున్సిపల్ సర్కిల్ కార్యాలయాన్నే అడ్డాగా మార్చుకుని దర్జాగా విందు చేసుకున్న వైనం కాప్రా సర్కిల్ కార్యాలయంలో చోటుచేసుకుంది. రాత్రివేళ సర్కిల్ కార్యాలయాలన్ని బార్‌గా మార్చుకుని దర్జాగా సుక్క, ముక్క వేసుకుని ఎంజాయ్ చేశారు.

మున్సిపల్ సిబ్బందే ఇలా మందేసి చిందేయడం ఇక్కడ సర్వసాధారణమైంది. ఏళ్ల తరబడి అక్కడి కార్యాలయంలోనే తిష్టవేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాలివేషన్ అధికారిగా చలమణి అవుతున్న సురేందర్ గౌడ్ సిబ్బందితో కలిసి కార్యాలయాన్ని బార్‌గా మార్చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయంలో మందేసిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటారో... లేదో వేచి చూడాల్సిందే.

Next Story