ద‌ళారి వ్య‌వ‌స్థ నిర్మూల‌న కోస‌మే కొనుగోలు కేంద్రాలు

by Nallavelli.Anjaneyulu |

దళారి వ్యవస్థను నిర్మూలించి, నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ తెలిపారు.

ద‌ళారి వ్య‌వ‌స్థ నిర్మూల‌న కోస‌మే కొనుగోలు కేంద్రాలు
X

దిశ, మేడ్చల్ : దళారి వ్యవస్థను నిర్మూలించి, నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ తెలిపారు. పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వడ్లు రాకముందే కేంద్రాలను ప్రారంభించామని, రైతులు కష్టపడి పండించిన ధాన్యమును దళారుల పాలు కాకుండా నేరుగా పరిధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని కోరారు. రైతులకు ఎలాంటి నష్టం కాకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఏ బ్లాక్ మాజీ అధ్యక్షుడు సింగరేణి పోచయ్య, మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ శ్యామ్ లాల్, మాజీ వార్డు సభ్యులు హన్మంత్ రెడ్డి, మల్లెల కృష్ణ, సొసైటీ ఇన్ చార్జి ఆర్ఎమ్ వీ ఆనంద్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, వ్యవసాయ విస్తీర్ణాధికారి తేజస్విని, సొసైటీ డైరెక్టర్ విఠ‌ల్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story